జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని మొట్ట మొదటి సారి గెలుచుకున్నది. కర్నాటకతో హుబ్లీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూకశ్మీర్ జట్టుకు రంజీ ట్రోఫీ దక్కింది. జేకే బ్యాటర్లు కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రాలు.. కర్నాటక బౌలర్లను ఆటాడుకున్నారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్ అజేయంగా 197 రన్స్ జోడించారు.

