చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కాపులకు సీఎం పదవి కావాలని ఇది వారి ఎన్నో ఏళ్ల కోరిక అని గుర్తుచేశారు. ఆంధ్రా రాజకీయాల్లో కాపు సామాజికవర్గం చాలా బలమైనదని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు.చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారని…అసెంబ్లీ సీట్లు తక్కువ తీసుకున్నారు అని గుర్తు చేశారు.

