
మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అస్తంబా దేవీ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల పికప్ వ్యాను ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం అంత భయంకరంగా ఉండటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సాక్షుల ప్రకారం, వ్యాను అధిక వేగంతో వెళ్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలోనే 8మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.