
గ్రూప్-2 పరీక్షలో విజేతలకు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం.. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలి.’ అని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.