గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో నిరుద్యోగుల కలసాకారం అయ్యిందని, ఇది గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

