జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఫలితాలు వెలువడిన తర్వాత తన మద్దతుదారులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నాడు. గౌరీ లంకేష్ హత్య కేసులో ఇప్పటి వరకు తనకు ఎలాంటి శిక్ష పడలేదని శ్రీకాంత్ పంగర్కర్ తెలిపాడు. న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నాడు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5న కర్ణాటకలోని బెంగళూరులో ఇంటి బయట కాల్చి చంపారు.

