గురు నానక్ జయంతి మొదటి సిక్కు గురువు గురు నానక్ జన్మదినమును పండుగగా జరుపుకునే రోజు. అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరైన గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపకులు.సిక్కు మతం స్థాపకుడైన గురు నానక్ 1469 లో కార్తీక పౌర్ణమి రోజున జన్మించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజును ప్రపంచమంతటా ప్రార్థనలతో ఈ పర్వదినమును వేడుకగా జరుపుకుంటారు

