అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుత్తి మండలం బేతాపల్లిలో టీడీపీ నేత రవితేజ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఆ ఇసుకను కొనుగోలు చేయాలని స్థానిక సోలార్ కంపెనీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఒక్కో టిప్పర్ ఇసుకను ఏకంగా రూ. 24,000కు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు. అయితే, ఇంత భారీ మొత్తానికి ఇసుకను కొనేందుకు సదరు సోలార్ ఉద్యోగి నిరాకరించడంతో, ఆగ్రహం చెందిన రవితేజ, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు.

