రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం.. ఆత్మహత్యల రాజధానిగా మారుతోంది.. అని ఆయన పేర్కొనడం గమనార్హం. రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోందని, జాతీయ నేరగణాంకాలను బట్టి ప్రతియేటా ఈ రాష్ట్రంలో 20 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం ఉదయం ‘సింధూ సరస్వతి నాగరికత మహానాడు’ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 65 మంది చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.

