
పంజాబ్‌లోని సర్‌హింద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్-సహర్ష గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ఏసీ బోగీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బోగీలో పొగ వస్తున్నట్లు గుర్తించిన ప్రయాణికులు రైలును నిలిపివేశారు. అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వగా, వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను బోగీ నుంచి ఖాళీ చేయించారు. ఫైర్‌ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను మరో కోచ్‌లోకి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.