గరికపాటి చేసిన వ్యాఖ్యల పట్ల AP ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు, మధ్యాహ్న భోజనం అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి బిడ్డకు ఉన్న ప్రాథమిక హక్కు. కేవడం జీవించడం మాత్రమే కాదు. గౌరవంగా బతకడం అనేది దాని ఉద్దేశం. పోషకాహారం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కోర్టు దీన్ని ఓ రాజకీయ అంశంగా కాకుండా పిల్లలకు దక్కాల్సిన హక్కుగా భావించి తీర్పులు ఇచ్చినట్లు గుర్తుచేశారు.

