ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో పాలన పగ్గాలు మారాయి. సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్కు మారింది. అందుకోసం తాత్కాలికంగా ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇందులో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, న్యాయవ్యవస్థ అధిపతి హొస్సేన్ మొహ్‌సెని ఎజెయ్, గార్డియన్ కౌన్సిల్ నుంచి ఒకరు ఉండనున్నారు. కొత్త సుప్రీం నేతను నియమించేవరకు ఈ కౌన్సిల్ తాత్కాలికంగా పాలనా బాధ్యతలను చూసుకోనుంది

