ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న కేసులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాథమిక పరీక్షలు, గుర్తించిన అంశాలు, తీసుకోబోతున్న చర్యలను మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్యసేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాథమిక పరిశీలన ద్వారా క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే అరికట్టవచ్చునని పేర్కొన్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 675.66 కోట్లను క్యాన్సర్ పీడితులకు వైద్యాన్ని అందించేందుకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.

