శరీరం చెప్పే మాట అందరూ వినడంతో పాటు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్య ఉండకూడదని నటుడు చిరంజీవి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు ప్రసంగించారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించడంతో క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించగలుగుతామని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు తెలిపారు.

