
తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ టిసి డిపోల ముందు బిసి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఆర్ టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బిసి సంఘాలు, రాజకీయ పార్టీల పిలుపు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి.