loader

కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవి సిపిఐకి వరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు శనివారం కలిసి చర్చించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహా ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించారు. మేయర్ పదవి సిపిఐకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఖరారయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యధిక వార్డుల్లో సిపిఐ విజయం సాధించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON