తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. | హుస్నాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.| కరీంనగర్ 50వ డివిజన్ జ్యోతినగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు | నందికొండ మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల 5 వార్డులో మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు.

