టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, టీవీలో మాత్రమే చూశానని నాని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, కేశినేని చిన్ని అంటే కూడా భయం లేదని, కేశినేని చిన్ని పరిస్థితి చూస్తే గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఎఫెక్ట్ కనిపిస్తోందని విమర్శించారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదని, చిన్నితో పాటు ప్రభుత్వ పెద్దల పతనం మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయని నాని వ్యాఖ్యానించారు.

