బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ బాధితులు ఈరోజు హైదర్ షా కోట్‌లో ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్ర చేపట్టారు. కేటీఆర్ ఈ పాదయాత్రలో పాల్గొని బాధితులతో కలిసి మూడున్నర కిలోమీటర్లు నడిచారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్, గంధం గూడ, శివారం కాలనీ, డ్రీమ్ హోమ్స్, రాజీవ్ గృహకల్ప నివాసులు సహా వందల కుటుంబాల వారు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. “పేదల పొట్ట కొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయం. ప్రతి ఇంటికీ అండగా మేముంటాం” అని హామీ ఇచ్చారు.

