బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కెటిఆర్‌ను కలిశారు.

