ఈవారం అగస్ట్ 14న రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్లుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల టికెట్ ధరలు అనవసరంగా పెంచడం పై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రజినీకాంత్, నాగార్జున కూలీ చెన్నైలో టికెట్ ధర 150‑200, హైదరాబాద్లో అది 400, ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 హిందీ వర్షన్ కు 180‑250 టికెట్ ధర ఉండగా, తెలుగు డబ్బింగ్ కోసం 400‑500 వరకు పెంచుకోవడానికి అనుమతులు తీసుకున్నారు.

