కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తాజాగా పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు,రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న వారిని ఇళ్లకు పంపుతున్నట్లు వెల్లడించారు.

