
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. అఫ్గనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా గగనతల దాడులకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది దేశం. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడిందని శుక్రవారం తాలిబన్ సీనియర్ నేత ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (AFP)తో వెల్లడించారు. తాము పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.