
నిజామాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో రియాజ్ హతమయ్యాడు. సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రోజులుగా పరారీలో ఉన్న రియాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రియాజ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకున్నట్లు సమాచారం. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు.