జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గ రహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు. లోయ అంతటా పలు చోట్ల శాంతి ప్రదర్శనలు జరిపారు. దేశ ఐక్యత, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని ప్రముఖ ముస్లింలతో కూడిన పౌర సమాజ గ్రూప్ పిలుపునిచ్చింది. అమాయకులను చంపడాన్ని ఇస్లాం ఎంతమాత్రం అంగీకరించదని, ఉగ్రవాదుల క్రూరత్వానికి అమాయక టూరిస్టులు బలవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

