పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీరు నుంచి వెళ్లిపోతున్నారు. వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జమ్ముకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, పర్యాటకులు వెళ్లిపోతుండటం కలచివేస్తున్నదని, కశ్మీరు లోయ నుంచి అతిథులు వెళ్లిపోవడానికిగల కారణాలను తాము పూర్తిగా అర్థం చేసుకోగలమని తెలిపారు. శ్రీనగర్ నుంచి కేవలం 6 గంటల్లో, 20 విమానాల్లో 3,337 మంది పర్యాటకులు వెళ్లిపోయారు. వీరంతా బుధవారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో భయాందోళనలతో కశ్మీరును విడిచిపెట్టారు.

