మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరికుడు పాత్రలు ఇష్టం. కర్ణుడిలా నేనూ మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డాను. నేను కూడా బార్బరికుడిలా బలహీనులైన మాదిగల కోసం కొట్లాడా. మాదిగ, మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

