2026 సంవత్సరం ప్రారంభంలోనే అద్భుతం చోటుచేసుకుంది. మొదటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతం అయింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇండియాలోనూ ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. ఈ దృశ్యం ఏర్పడడానికి ముందు సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమైంది. ఇది సాయంత్రం 06 గంటల 47 నిమిషాలకు ముగిసింది. అలాగే చంద్రగ్రహణం సందర్భంగా మూసేసిన ఆలయాలను శుద్ధి చేసి భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. అలాగే చంద్రగ్రహణం విడిచిన తర్వాత అంతా స్నానాలు ఆచరించి, దైవ నామస్మరణలు చేశారు.

