బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం (ఫిబ్రవరి 4న) ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

