
రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన కంచగచ్చిబౌలి భూముల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో తాజాగా మరొ మలుపు చోటు చేసుకుంది. కంచగచ్చిబౌలిలో ఉన్న 2,725 ఎకరాల 23 గుంటల భూమికి నిజమైన
యజమాని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని ఆయన వారసులు తాజాగా ఆరోపిస్తున్నారు. అసఫ్ జాహి రాజవంశ వారసులు కంచగచ్చిబౌలిలోని 2,725 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సుమోటో రిట్ పిటిషన్లో తమను చేర్చుకోవాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.