వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఏడాది హోటల్ రూమ్ బుకింగ్స్ ఊహించని రీతిలో 170% పెరిగాయి. ఈ విపరీతమైన డిమాండ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రముఖ హోటల్ చైన్ ‘ఓయో’ (OYO) పేరుతో
సోషల్ మీడియాలో రకరకాల నకిలీ ఆఫర్లను సృష్టిస్తున్నారు. “కేవలం రూ.499లకే లగ్జరీ రూమ్”, “ప్రేమికుల కోసం 80% డిస్కౌంట్” అంటూ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆకర్షణీయమైన లింక్‌లను పంపిస్తున్నారు. ఈ ఆఫర్లను చూసి నిజమేనని నమ్మి క్లిక్ చేసేవారు ప్రమాదంలో పడుతున్నారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

