
ధన్‌తేరాస్ పండుగలో షాపింగ్ చేయడం భారతీయుల ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగమైంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో సిరిసంపదలు చేకూరుతాయని నమ్మకం. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఆభరణాల మార్కెట్లు రద్దీగా మారాయి. ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, వినియోగదారులు దాదాపు ₹1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.