సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. నేడు ఆగస్టు 12న ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ ఈరోజు ఉదయం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మను ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారు

