కర్ణాటకలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ల నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రులామనిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక,గడగ్ జిల్లాలో శనివారం జరిగింది. అరెస్టైన ఎమ్మెల్యే చంద్రులామని షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించి చేపట్టిన ఒక పనికి
అనుమతులు ఇచ్చి క్లియరెన్స్ రావాలంటే తనకు రూ.11 లక్షలు చెల్లించాల్సిందే అని పట్టుబట్టాడు.

