
అలుపెరుగని రాజకీయ శిఖరానికి కూతురు పేరుతో గండం ముంచుకొచ్చింది అసమ్మతి స్వరంతో కేసీఆర్‌కు కవిత లేఖ రాస్తే, ఐదు రోజుల క్రితం లేఖ మీడియాకు చిక్కింది. అలా చిక్కిన లేఖపై అనేక కథనాలు,విమర్శలు నేటీకి షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా కవిత లేఖపై నోరుమెదపలేదు. బీఆర్‌ఆర్ నేతలు అంత సహాసం ఎలా చేస్తారనే సందేహం రావొచ్చు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నారు.