సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత బాధితుడిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు నేరుగా సోదాలు చేసి ఎస్సై నందితను అదుపులోకి తీసుకున్నారు.