
ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డీఏ అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక డీఏ విడుదల చేయడం వల్ల రూ.160 కోట్ల వరకు భారం కానుంది అని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఒక డీఏ విడుదల చేయాలని నిర్ణయించినట్లు, అంతేకాదు త్వరలోనే పీఆర్సీపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.