
పేదల కోసం ప్రభుత్వం అందించే పిడిఎఫ్ బియ్యం.. రాష్ట్రంలోని వేర్వేరు పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది.. పౌరసరఫరాల శాఖ ప్రత్యేక మొబైల్ ర్యాపిడ్ కిట్లను రంగంలోకి దింపింది. 700 రాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను సిద్ధం చేసింది. ప్రభుత్వం సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ అయినట్లయితే.. ఈ ద్రావణాలు ఆ బియ్యంపై చల్లితే అవి ఎరుపు రంగుకు మారుతాయని.. బయట దుకాణాల్లో అమ్మే బియ్యం అయితే రంగు మారవు అని తెలిపారు.