కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్‌గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.

