ఉప్పల్ నియోజకవర్గపరిధిలోని ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేయూత అందించారు. 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కులను బుధవారం నాడు లక్ష్మారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డిని కేటీఆర్ అభినందించారు. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు చెక్కులు అందజేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసించారు

