
ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చంటూ చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు ఈఎల్‌కు సంబంధించి ఒక ఇన్‌స్టాల్‌మెంట్ 105 కోట్లు నవంబర్‌లో ఇస్తామని, జనవరిలో మరో రూ.105 కోట్లు ఇస్తామని.. 60 రోజుల్లోపు ఉద్యోగుల మెడిక్లెయిమ్ వ్యవస్థను స్ట్రీమ్‌లైన్ చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఒక ప్రమోషన్‌కు కూడా.. దీపావళి లోపు క్లియర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పీఆర్సీ విషయంలో వెసలుబాటు కావాలన్నారు.