శ్రీలంక దక్షిణ తీరం నుంచి వెళుతున్న ఒక ఇరాన్ యుద్ధ నౌక (IRIS Dena)పై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారని అమెరికా పేర్కొంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ద నౌకపై తాము జరిపిన దాడికి సంబంధించిన వీడియోను అమెరికా సైన్యం విడుదల చేసింది. ఇరాన్ నౌక నుండి ప్రమాద సంకేతం అందిన వెంటనే, శ్రీలంక సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

