సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.

