ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి.

