ఇరాన్‌లోని పలు నగరాలు, ప్రత్యేకించి రాజధాని టెహరాన్‌ను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు నిర్విరామంగా దాడులకు దిగుతున్నాయి. టెహరాన్ ఆకాశం ఎప్పుడూ నిప్పులు కక్కే రీతిలో మారుతోంది. క్షిపణులు, యుద్ధ విమానాలను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాల దాడులతో ఇరాన్‌లో 555 మంది వరకూ పౌరులు మృతి చెందినట్లు, ఇది తమకు అదికారికంగా అంటే నిర్థారణ అయిన సమాచారం అని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది.

