పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాలను కూడా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు మరియు 9 యుద్ధ నౌకలను కూల్చివేసినట్లు ట్రంప్ ధ్రువీకరించారు.

