ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ప్రభుత్వాధినేత ఖమేనీకి, అతడి పాలనకు వ్యతిరేకంగా శనివారం నినదించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్, మషాద్ పట్టణాల్లో విద్యార్థులు, యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని, అతడి పాలన నుంచి తమకు స్వేచ్ఛ కావాలని, అలాగే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

