దేశంలో నేడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి మొత్తం 326 సీట్లు దక్కుతాయని సర్వే వెల్లడించింది.బీజేపీ సొంతంగా 261 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. 2024 ఎన్నికల్లో ఆకట్టుకునే ప్రదర్శనతో 234 సీట్లు సాధించిన ఇండియా కూటమి.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 190 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే తెలిపింది.

