వందే భారత్, నమో భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూర్చోవడం అంటే విలాసం, సౌకర్యం, సినిమా ప్రయాణం అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నమో భారత్ ఎక్స్ప్రెస్ రైలకు సంబంధించినది. ఇందులో లగ్జరీ సీట్ల కంటే ఎక్కువ మంది రైలులో నిలబడి, తలుపుల దగ్గర వేలాడుతూ కనిపిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, సీటు రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులు కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.

