ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన గోలేస్తాన్ మహల్ ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో దెబ్బతిన్నట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. గోలేస్తాన్ మహల్ తెహ్రాన్‌లోని అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన సముదాయాలలో ఒకటి. ఇది నగర మధ్యభాగంలో ఉండి, ఒకప్పుడు పర్షియా రాజవంశాల అధికార నివాసంగా ఉపయోగించేవారు. ఇరాన్ సామ్రాజ్య చరిత్రకు ఇది శక్తివంతమైన చిహ్నంగా ఇప్పటికీ నిలిచివుంది.

